జాతీయంTMC Internal Crisis | రెండు ముక్కలుగా చీలనున్న టీఎంసీ.. బెంగాల్ మంత్రి ...

TMC Internal Crisis | రెండు ముక్కలుగా చీలనున్న టీఎంసీ.. బెంగాల్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి.

అక్షరటుడే వెబ్‌డెస్క్: TMC Internal Crisis | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండు ముక్కలైన తరహాలోనే, బెంగాల్‌లో టీఎంసీ కూడా త్వరలోనే రెండుగా చీలిపోబోతుందని ఆ రాష్ట్ర మంత్రి తపస్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎలాంటి గుర్తింపు లేని వారికి మమతా బెనర్జీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇప్పుడు ఈ అసంతృప్తి బయటపడిందని ఆయన విమర్శించారు. త్వరలోనే టీఎంసీ రాజకీయంగా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. కాగా, ఈయన 2024లోనే టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.

mamatha.1 1

TMC Internal Crisis | మమత చేతుల్లో పార్టీ లేదు..

మరోవైపు టీఎంసీలో తిరుగుబాటు వర్గానికి ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీఎంసీ పూర్తిగా ‘ఐప్యాక్’ (I-PAC) సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయిందని, అది ఇక ఎంతమాత్రం మమతా బెనర్జీ ( Mamata Banerjee) పార్టీ కాదని రితబ్రత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది ఎమ్మెల్యేలు మమత నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ గుర్తును కూడా తామే సొంతం చేసుకోవాలని చూస్తున్నారని పార్టీ జాతీయ ప్రతినిధి రిజుదత్తా తెలిపారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలంతా రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటున్నారని, కానీ మమతా బెనర్జీ మాత్రం ఆ పదవిలో శోభన్‌దేబ్ చటోపాధ్యాయను కూర్చోబెట్టాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అంతర్గత తిరుగుబాటు నేపథ్యంలో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలను టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించగా, రిజుదత్తాను సస్పెండ్ చేసింది.

mamatha 1

TMC Internal Crisis | నేను పోరాడుతా.. లేదంటే చనిపోతా…

పార్టీలో ఇంత పెద్ద సంక్షోభం నడుస్తున్నా.. మమతా బెనర్జీ మాత్రం ఎన్నికల తర్వాత తమ క్యాడర్‌పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను లొంగిపోయే ప్రసక్తే లేదు.. చివరి శ్వాస వరకు పోరాడుతాను, లేదంటే చనిపోతాను” అంటూ భాజపా ప్రభుత్వంపై మండిపడ్డారు. కనీసం నిరసన తెలియజేయడానికి ఒక స్టేజ్ వేసుకోవడానికి కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై కూడా రాళ్లు, గుడ్లతో దాడులు జరిగాయని ఆమె గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: Grama sabha | గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...