Illegal Constructions | 16 అక్రమ నిర్మాణాల కూల్చివేత

సైబరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు సోమవారం 16 అక్రమ నిర్మాణాలను కూల్చి వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Illegal Constructions | అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్ (CMC)​ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి భవనాలను కూల్చి వేస్తున్నారు.

గచ్చిబౌలి అంజయ్య నగర్​లో ఇటీవల 50 గజాల్లో నిర్మించిన ఏడంతుస్తుల భవనం కూలిపోయి ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం సైబరాబాద్​ కార్పొరేషన్​ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిత్యం పలు కాలనీల్లో పర్యటిస్తూ అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్నారు. అనంతరం నోటీసులు జారీ చేసి వాటిని కూల్చి వేస్తున్నారు.

Illegal Constructions | నిత్యం తనిఖీలు

అనధికార నిర్మాణాలను తొలగించడానికి, భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసేందుకు, సీఎంసీ బృందాలు మూడు జోన్‌లలోనూ క్షేత్రస్థాయి తనిఖీలు చేపడుతున్నాయి. సోమవారం అధికారులు 16 నిర్మాణాలను కూల్చివేశారు. మరో 15 అనధికార భవనాలను గుర్తించారు. రెండింటికి నోటీసులు జారీ చేశారు. ఒక భవనాన్ని సీజ్​ చేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను, తక్కువ అంతస్తులకు పర్మిషన్​ తీసుకొని.. ఎక్కువ కడుతున్న నిర్మాణాలను తొలగిస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Heavy Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. 13 నుంచి భారీ వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *