అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain Alert | తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు పడుతాయని పేర్కొన్నారు.
తెలంగాణలో గత 15 రోజులుగా వర్షాలు లేవు. అడపదడప చిరు జల్లులు మాత్రమే కురిశాయి. ఎల్నినో ప్రభావంతో ఈ సీజన్లో ఇప్పటికే లోటు వర్షపాతం నమోదు అయింది. దీంతో చెరువులు, జలాశయాలు ఇంకా నిండలేదు. మరోవైపు వేసిన పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలు కురుస్తాయనే వార్తతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Heavy Rain Alert | 17 వరకు..
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడనుంది. అది అల్పపీడనంగా మారుతుంది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విస్తారంగా వర్షాలు పడుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో కూడా బలమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. సెప్టెంబర్ 10 లేదా 11 నుండే తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాల ప్రభావం మొదలు కానుంది.
దీనిని కూడా చదవండి : TSRTC Merger | ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..