అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shabad Murder Case | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్ మండలం దైవాలగూడలో ఆరు హత్యలు చేసిన రాజ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అతడి కుటుంబ సభ్యులు మృతదేహం తీసుకు వెళ్లడానికి నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది అనాథ శవంలా అంత్యక్రియలు చేశారు.
తనపై పోక్సో కేసు పెట్టారని పగతో ఓ బాలికను ఆమె తల్లి, నాయనమ్మను రాజ్‌కుమార్ హత్య చేసిన విషయం తెలిసిందే. అంతేగాకుండా తన భార్య పిల్లలను సైతం చంపేశాడు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం అతడి మృతదేహాన్ని చేవేళ్ల ఆస్పత్రికి తరలించారు.
Shabad Murder Case | ముందుకురాని డాక్టర్లు
రాజ్ఉకమార్ పోస్టుమార్టంలో మూడు గంటల జాప్యం జరిగింది.డ్యూటీలో ఉన్న వైద్యురాలు పోస్టుమార్టం చేసేందుకు ముందుకు రాకపోవడంతో మూడు గంటల పాటు నిలిచిపోయింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రణీత్‌ను పిలిపించి పోలీసులు పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంబులెన్స్‌లో ఉన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, సోదరుడు వెనుదిరిగారు.
Shabad Murder Case | మున్సిపల్ సిబ్బంది సహకారంతో..
చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్‌కుమార్ ఓ బాలికను ఆమె తల్లి, నాయనమ్మను హత్య చేయడంతో ఆ ఇంట్లో మరో బాలిక ఒంటరి అయిపోయింది. ఆమె దివ్యాంగురాలు. దీంతో ప్రభుత్వం బాధితురాలకి రూ.10 లక్షల పరిహారం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి..: Rajkumar Selfie Video | ఆరు హత్యలకు ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. నాలుగు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం