అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal Car Accident | భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Bheemgal Car Accident | ఆర్మూర్ నుంచి భీమ్‌గల్ వస్తుండగా..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ నుంచి భీమ్‌గల్ (Bheemgal) వస్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఛైర్‌పర్సన్ నాగమణి, ఆమె భర్త స్వామి, కుమారుడు, కుమార్తె స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని, క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Bail Promise Theft | బెయిల్ ఇప్పిస్తానని చెప్పి గుండ్లు దోచుకెళ్లాడు.. 48 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు