అక్షరటుడే, వెబ్డెస్క్ : Ladki Bahin Scheme | మహారాష్ట్ర లడ్కీ బహిన్ పథకంలో భారీగా లబ్ధిదారులను తొలగించారు. దీంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.
మాఝీ లడ్కీ బహిన్ యోజన (Majhi Ladki Bahin Yojana) జాబితా నుండి 92 లక్షల మహిళల పేర్లను ప్రభుత్వం తొలగించింది. ఈ-కేవైసీ ప్రక్రియ తర్వాత అనర్హులపై వేటు వేసినట్లు పేర్కొంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.1,500 సాయం అందుతుంది. తాజా తొలగింపు తర్వాత 2.47 కోట్ల నుంచి 1.70 కోట్లకు లబ్ధిదారులు తగ్గిపోయారు. ఎన్నికల తర్వాత మహిళలను మోసం చేశారని ప్రతిపక్షాల విమర్శించారు.
Ladki Bahin Scheme | ఈ కేవైసీ చేయకపోవడంతో.
సుమారు 50 నుంచి 55 లక్షల మంది మహిళలు గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు. అదే సమయంలో 12 లక్షల మంది మహిళల వార్షిక కుటుంబ ఆదాయం ఈ పథకానికి నిర్దేశించిన పరిమితిని మించిపోయింది. 4.5 లక్షల మందికి పైగా మహిళలు గరిష్ట వయోపరిమితి అయిన 65 ఏళ్లను దాటి ఉన్నారు. దీంతో వారిని తొలగించారు. సుమారు 14 వేల మంది పురుషులు ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నించారు. దీంతో వారి పేర్లు జాబితా నుండి తొలగించారు. ఈ కేవైసీ కోసం ప్రభుత్వం 8 నెలల సమయం ఇచ్చినా.. సుమారు 55 లక్షల మంది చేసుకోలేదు. దీంతో వారి పేర్లు జాబితా నుంచి తొలగించారు.
Ladki Bahin Scheme | ఎన్నికల ముందు ప్రారంభం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి సీఎం ఎక్నాథ్ షిండే ఈ పథకాన్ని ప్రారంభించారు. 2024 ఆగస్టు 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 21 నుంచి 65 ఏళ్ల మహిళలకు ప్రతినెలా రూ.1500 బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా భారం పడింది. అయితే ఈ పథకంలోనే బీజేపీ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్థిక భారం నేపథ్యంలో ప్రభుత్వం ఈ కేవైసీ పేరిట భారీగా లబ్ధిదారులను తొలగించింది.
ఇది కూడా చదవండి..: Temple Hundi Security | ఆలయ హుండీలకు ‘డిజిటల్’ భద్రత.. కర్ణాటక ప్రభుత్వ కొత్త నిబంధనలు