Diesel Theft from Train | ఆగి ఉన్న రైలులో డీజిల్ చోరీ

బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Diesel Theft from Train | బీహార్‌ (Bihar)లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పక్కనే ఉన్న రైలు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరిస్తున్నా, ఏమాత్రం భయం లేకుండా అతను తన పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రైలు ఆగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇంధనాన్ని తీస్తున్నట్లుగా ఆ ఫుటేజీలో కనిపిస్తోంది. ఇది అక్కడున్న వారి, సోషల్ మీడియా వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి ఘటన ఎలా జరిగిందని చాలామంది ప్రశ్నిస్తూ, రైల్వే ఆస్తుల చుట్టూ కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇంధన దొంగతనం, ప్రజా మౌలిక సదుపాయాల భద్రత, రైల్వే ప్రాంతాలలో నిఘా పెంచాల్సిన అవసరం గురించి చర్చకు దారి తీసింది. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Diesel Theft from Train | రక్షణ కరువు

దేశంలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కొందరు ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన సామగ్రిని ఎత్తుకెళ్తున్నారు. రైళ్లలో డీజిల్​తో పాటు ఇతర వస్తువులు ఎత్తుకెళ్లిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. అంతేగాకుండా అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లు, ఇతర పరికరాలను సైతం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. పాఠశాలల్లో టీవీలు, కంప్యూటర్లను చోరీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తుల చోరీ, ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *