Breakfast Scheme | బీఆర్​ఎస్​ హయాంలోనే బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్​ ప్రారంభించాం : కేటీఆర్​

బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను గురువారం కేటీఆర్​ పంపిణీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Breakfast Scheme | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ (KTR) సూచించారు. బేగంపేటలోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను గురువారం ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పీవీ నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కేటీఆర్​ అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలి అని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 2023లో కేసీఆర్ నాయకత్వంలో ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం’ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు.

Breakfast Scheme | విద్యార్థుల సంక్షేమానికి..

గత ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక కార్యక్రమాలు అమలు చేశామని కేటీఆర్​ తెలిపారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సేవలను ప్రశంసించారు.

దీనిని కూడా చదవండి : Diesel Theft from Train | ఆగి ఉన్న రైలులో డీజిల్ చోరీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *