Bengal Opposition Leader | టీఎంసీలో వర్గపోరు.. హైకోర్టులో మమతకు ఎదురుదెబ్బ

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత నియామక వివాదంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bengal Opposition Leader | పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ప్రతిపక్ష నేత నియామక వివాదంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి ( Mamata Banerjee ) కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో రితబ్రత బెనర్జీ ఆ పదవిలో యథావిధిగా కొనసాగుతారని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Bengal Opposition Leader | అంతర్గత విభేదాలు ..

ఇటీవలి ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన పరాజయం తర్వాత పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. పార్టీ నాయకత్వం షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించగా, దీనిని రితబ్రత బెనర్జీ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. 58 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రితబ్రత ప్రతిపక్ష నేత పదవిని దక్కించుకోవడంతో, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా సన్నిహితుడైన షోవన్‌దేబ్ హైకోర్టును ఆశ్రయించారు.

Bengal Opposition Leader | స్పీకర్ తీరుపై కోర్టు ప్రశ్నలు..

ఈ కేసును విచారించిన జస్టిస్ కృష్ణారావు స్పీకర్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. మే 9న షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను గుర్తించాలని అందిన లేఖను పక్కనపెట్టి, జూన్ 3న తిరుగుబాటు వర్గం నుండి వచ్చిన వినతిపై స్పీకర్ ఎందుకు అంత వేగంగా చర్యలు తీసుకున్నారని కోర్టు నిలదీసింది. దీనిపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జులై 28కి వాయిదా వేసింది.

Bengal Opposition Leader | రాజకీయ సందిగ్ధత..

పార్టీ వ్యతిరేక చర్యల పేరుతో జూన్ 1న రితబ్రత బెనర్జీని టీఎంసీ బహిష్కరించినప్పటికీ, ఎమ్మెల్యేల మద్దతు ఆయనకే ఉండటంతో బెంగాల్ రాజకీయాల్లో అనిశ్చితి కొనసాగుతోంది. హైకోర్టు తాజా నిర్ణయం మమతా వర్గానికి పెద్ద దెబ్బ కావడంతో, జులైలో జరగబోయే విచారణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.

ఇది కూడా చదవండి: Breakfast Scheme | బీఆర్​ఎస్​ హయాంలోనే బ్రేక్​ఫాస్ట్​ స్కీమ్​ ప్రారంభించాం : కేటీఆర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *