అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Venky Anil Movie | దగ్గుబాటి వెంకటేష్ (Venkaetesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది. గురువారం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు.
వెంకటేశ్‌తో అనిల్‌రావిపూడి ఇప్పటికే పలు చిత్రాలు తీసి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఎఫ్–2, ఎఫ్–3, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలను వెంకీతో అనిల్ తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాగే కల్యాణ్‌రామ్‌తో అనిత్ తన తొలి చిత్రం పటాస్ తీశారు. ఇది కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవల చిరంజీవితో మన శంకర వరప్రసాద్ తీసి దర్శకుడు హిట్ కొట్టాడు.
Venky Anil Movie | మల్టీ స్టారర్

అనిల్ రావిపూడి తాజాగా వెంకటేశ్, కల్యాణ్ రామ్‌తో సినిమా తీస్తున్నారు. ఇందులో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. ‘VenkyAnil5’ అనే వర్కింగ్ టైటిల్‌తో దీనిని తెరకెక్కిస్తున్నారు. రాఘవేంద్రరావు, దిల్‌రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై షూటింగ్‌ను ప్రారంభించారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు సాధించాలని అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్‌రాజు టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లను డైరెక్టర్ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే.
సినిమా ప్రారంభం రోజే… అనిల్ రావిపూడి మార్క్ 😀 సంక్రాంతికి థియేటర్స్ జాతర..
ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైన @VenkyMama @NANDAMURIKALYAN @AnilRavipudi
సినిమా. 💥 pic.twitter.com/Fil4v5kKic— H A N U (@HanuNews) June 18, 2026
ఇది కూడా చదవండి : Road Accident Deaths | రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి