Road Accident Deaths | రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

తెలంగాణలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Road Accident Deaths | తెలంగాణ (Telangana)లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. జనగామ జిల్లా, మేడ్చల్​ జిల్లాలో యాక్సిడెంట్లు జరిగాయి.

రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా రాత్రి పూటు, తెల్లవారుజామున యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. హైవేలపై అతివేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనగామ జిల్లా (Jangaon District) లింగాలఘనపూర్‌ మండలం నెల్లుట్ల రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలంలో జాట్ రోహిత్ కిరాణా దుకాణం నిర్వహిస్తాడు. భువనగిరి జిల్లా (Bhuvanagiri District) గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన మధుతో కలిసి రోహిత్​ టాటా ఏస్ మినీ ట్రక్కులో హైదరాబాద్ నుంచి కిరాణా సామగ్రి తీసుకొని వస్తున్నాడు. అయితే నెల్లుట్ల సమీపంలోకి రాగానే వారి ట్రక్కు టైరు పంక్చర్‌ అయింది.

Road Accident Deaths | ఢీకొన్న లారీ..

టైర్​ పంక్చర్​ కావడంతో మధు, రోహిత్​ ఆ మార్గంలో వెళ్తున్న లారీని ఆపారు. వారి నుంచి జాకీ తీసుకొని టైర్​ మారుస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ వీరి ఢీకొంది. దీంతో లారీ క్లీనర్ రాజేందర్, ట్రక్కు డ్రైవర్ మధు, కిరాణా దుకాణ యజమాని రోహిత్
మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Road Accident Deaths | లారీని ఢీకొన్న కారు

మేడ్చల్‌ పరిధిలోని తుర్కపల్లి-మురహరిపల్లి మధ్య కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంఇ. అనంతరం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 26న రైతు భరోసా విడుదల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *