DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో 17 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్​ ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17 మందికి స్థాన చలనం కలిగించారు.

వెయిటింగ్​లో ఉన్న కె. బాలకృష్ణారెడ్డిని మల్కాజ్​గిరి సైబర్​ క్రైమ్ (Cyber Crime)​ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న ఎస్​జీ శివశంకర్​ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వెయిటింగ్​లో ఉన్న ఎస్​కే అబ్దుల్ రెహ్మాన్​ను భూపాలపల్లి డీసీఆర్​బీ డీఎస్పీగా పంపించారు. ఏ రవికుమార్​ను జగిత్యాల డీసీఆర్​బీకి, నందిరామ్​నాయక్​ను హైదరాబాద్​ సిటీ డీజీ కంట్రోల్​ రూమ్​కు బదిలీ చేశారు.

DSP Transfers | టీజీపీఏకు..

వెయిటింగ్​లో ఉన్న సోమ్​నారాయణ సింగ్​ను తెలంగాణ పోలీస్​ అకాడమీ (TGPA)కి, జే వెంకటేశ్వర్​రావును మెదక్​కు, బి కృష్ణకుమార్​ను సెక్రెటెరీయట్​ సెక్యూరిటీ ఏసీపీగా నియమించారు. ఎల్​ రమేశ్​కుమార్​ను సీటీసీ ఏసీపీగా, ఎన్​ శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి డీఎస్పీగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కడారు వెంకట్​రెడ్డి తెలంగాణ పోలీస్​ అకాడమీకి, కోమట్ల సుబ్బరామిరెడ్డి సీసీఎస్​ ఏసీపీగా, ఎస్​ సుదర్శన్​ సీసీఎస్​కు, ఎన్​ శంకర్​ సెక్రెటెరీయట్​కు బదిలీ అయ్యారు. పి విజయ్​ కుమార్​ వెస్ట్​ జోన్​ రోడ్​ సేఫ్టీగా డీఎస్పీగా, కె భాస్కర్​ టీజీపీఏకు, ఎం వెంకట నర్సయ్య సీఐడీ డీఎస్పీగా ట్రాన్స్​ఫర్​ అయ్యారు.

దీనిని కూడా చదవండి : ACB Caught DEE | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన డీఈఈ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *