అక్షరటుడే, వెబ్‌డెస్క్: Yadadri Pharma Accident | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజీలో ఫార్మా కంపెనీలో శనివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. మృతులను నాగిరెడ్డి, నరేష్‌గా గుర్తించారు.
రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
Yadadri Pharma Accident | మూడు నెలల్లో రెండో ప్రమాదం
ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. రియాక్టర్‌లో సాంకేతిక లోపం కారణంగానే పేలుడు సంభవించిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కంపెనీలో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై కూడా విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Rupareddy Murder | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య.. ఇది ఒక్క నేరం కాదు.. మనందరికీ ఒక హెచ్చరిక
కాగా, హెజీలో ఫార్మా కంపెనీలో మూడు నెలల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదం కావడం ఆందోళన కలిగిస్తోంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు, కార్మికులు కోరుతున్నారు.