అక్షరటుడే, వెబ్డెస్క్ : Konda Surekha Letter | మంత్రి కొండా సురేఖ మరోసారి పీసీసీ క్రమ శిక్షణ కమిటీకి లేఖ రాశారు. కొందరు తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని సురేఖ పేర్కొన్నారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినా తనపై, కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. విచారణ కొనసాగుతుండగానే అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలన్నారు.
Konda Surekha Letter | అసలు వ్యక్తులు ఎవరు..
పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తుండటంపై మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో గుర్తించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని కోరారు.
కొండా సురేఖ మరో సంచలన లేఖ..
పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ..
ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లలో తనను టార్గెట్ చేయడంపై ఆగ్రహం..
వారి వెనకాల ఏదో అదృశ్య ఉందని కొండా సురేఖ ఆరోపణ.. pic.twitter.com/qYm3IZcm2d
— Prabhakar Venavanka (@Prabhavenavanka) August 22, 2026
దీనిని కూడా చదవండి : Illegal Tree Cutting | అనుమతి లేకుండా చెట్ల నరికివేతపై అటవీ శాఖ చర్యలు