Chandanagar SI | ఏసీబీకి చిక్కిన చందానగర్​ ఎస్సై

చందానగర్​ ఎస్సై బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chandanagar SI | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని చందానగర్​ ఎస్సై బాలరాజు (SI Balaraju) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ల్యాండ్​ సెటిల్​మెంట్​ విషయంలో బాధితుడి నుంచి ఎస్సైతో పాటు కానిస్టేబుల్​ రాఘవేంద్ర కుమార్​ లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Chandanagar SI | రూ.75 వేలు తీసుకుంటుండగా..

ఎస్సై బాలరాజుతో పాటు కానిస్టేబుల్​ రాఘవేంద్ర కుమార్​ను ఏసీబీ (ACB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఫిర్యాదుదారుడి నుంచి గతంలో రూ.25 వేలు తీసుకున్నారు. తాజాగా మరో రూ.75 వేలు తీసుకుంటుండగా ఏసీబీ వల పన్ని పట్టుకుంది. అనంతరం పోలీస్​ స్టేషన్​లో అధికారులు తనిఖీలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై లంచం తీసుకుంటూ చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. రోజుకో అధికారి పట్టుబడుతున్నాడు. అయినా లంచాలకు మరిగిన వారు మాత్రం భయపడటం లేదు. ఏసీబీకి చిక్కినా.. కఠిన చర్యలు లేకపోవడంతో లంచాలు తీసుకోవడం మానడం లేదు.

దీనిని కూడా చదవండి : HYDRAA Commissioner | అంజయ్యనగర్​లో అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం : హైడ్రా కమిషనర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *