అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Telangana Police Sports Meet | తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 ముగింపు ఏర్పాట్లను సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. జానకంపేట్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్‌ను శనివారం సందర్శించారు.
Telangana Police Sports Meet | క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా..
ఈ సందర్భంగా జానకంపేటలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్‌ను సందర్శించిన సీపీ గ్రౌండ్‌లో వేదిక ఏర్పాటు, పరేడ్ నిర్వహణ, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, అతిథులు, ప్రేక్షకుల కోసం కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్‌బాబు, ఎడపల్లి ఎస్సై రమ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తేనే.. గిగ్ వర్కర్లకు పూర్తి న్యాయం