Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య

అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​క్రైం: Illegal Moneylenders | అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ( Nizamabad Police) శనివారం పలు ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించారు.

Illegal Moneylenders | ఏకకాలంలో 67 ప్రాంతాల్లో తనిఖీలు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్​, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ప్రజలను అధిక వడ్డీల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ, అక్రమంగా వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేకంగా పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సంబంధిత వడ్డీ వ్యాపారుల ఇళ్లతో పాటు అనుమానిత ప్రదేశాల్లోనూ తనిఖీలు చేపట్టారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 67 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమవడ్డీ వ్యాపారాలకు సంబంధించిన ఆధారాలపై పోలీసులు పరిశీలన చేపట్టి , నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

Illegal Moneylenders | కఠిన చర్యలు తీసుకుంటాం..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ప్రజల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేస్తూ, అప్పులు తీసుకున్న వారిని వేధించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధమైన వడ్డీ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగిస్తామన్నారు. అప్పుల పేరుతో ప్రజలను బెదిరించడం, బలవంతంగా చెక్కులు లేదా ఇతర పత్రాలు తీసుకోవడం, చట్టవిరుద్ధంగా అధిక వడ్డీలు వసూలు చేయడం నేరమన్నారు. అక్రమంగా వడ్డీలు వసూలు చేసేవారి వివరాలు తెలిస్తే పోలీస్​శాఖకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల నిరసన 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *