అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mahesh Kumar Goud | 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ అని డీసీసీ(DCC Nizamabad) అధ్యక్షుడు నగేష్ రెడ్డి(Nagesh Reddy) అన్నారు. పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నగరంలోని (Nizamabad) ఆటోనగర్‌లో వక్ఫ్‌బోర్డ్ మాజీ ఛైర్మన్ మాజిద్‌ఖాన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు.
Mahesh Kumar Goud | ఎల్ఈడీ స్క్రీన్‌పై..
ఆటోనగర్‌లో టెలిఫోన్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో పీసీసీ చీఫ్ 40ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఎల్ఈడీ స్క్రీన్‌పై స్థానిక ప్రజలకు వివరించారు. ఎన్ఎస్యూఐలో కార్యకర్త నుంచి నేటి పీసీసీ చీఫ్ వరకు ఆయన సాధించిన విజయాలను స్క్రీన్‌పై చూపించారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మేయర్ ఉమారాణి మాట్లాడుతూ.. రెండేళ్ల కాలంలో పీసీసీ చీఫ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో విజయవంతమయ్యామన్నారు. ఆయన సారథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేంద్రప్రసాద్, బంటు బలరాం, కార్పొరేటర్ నయీం షెహరాన్, సజ్జత్, అన్వర్, కరీం, అహ్మద్, నరేందర్ సింగ్, పత్తి శోభన్‌కుమార్, రాజ్ గగన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: హరీష్ రావు తండ్రిపై 100 ఎకరాలు