Clay Ganesh Idols | పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలి

పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలని నగర మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Clay Ganesh Idols | పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలని నగర మేయర్​ ఉమారాణి (Nizamabad Mayor) పేర్కొన్నారు. డీసీసీ(DCC Nizamabad) అధ్యక్షుడు నగేష్​రెడ్డి, కార్పొరేషన్​ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతో కలిసి మట్టిగణపతులను ఉచితంగా అందజేశారు.

Clay Ganesh Idols | 37వ డివిజన్​లో..

నగరంలోని 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్​ఛార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు పర్యావరణాన్ని కాపాడేందుకు మనవంతుగా కృషి చేయాలని, ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కో ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బంగారం ధరలపై.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *