Dasara Home Safety | పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త..: ఎస్పీ రాజేష్ చంద్ర

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తే బయలుదేరే ముందు ఒక్కసారి ఇంటి భద్రతను పరిశీలించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Dasara Home Safety | దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్తే.. ఇంటి భద్రతను పక్కాగా పరిశీలించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) సూచించారు. ఇంటికి వేసిన తాళం దొంగలకు ఆహ్వానం కాకూడదన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Dasara Home Safety | ఇంటికి తాళం వేసి వెళ్తే..

సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని, ఊరికి వెళ్లే ముందు నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇచ్చి ఇంటిని గమనించాలని కోరాలని సూచించారు. నాణ్యమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొబైల్ ద్వారా పర్యవేక్షించేలా అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. ఇంటి లోపల, బయట లైట్లు వెలిగేలా చూసుకోవాలని, వాహనాలను సురక్షిత ప్రదేశంలో పార్కింగ్ చేసి హ్యాండిల్ లాక్​తో పాటు వీల్ లాక్ కూడా వేయాలని సూచించారు. ప్రయాణ వివరాలను, ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో బహిరంగంగా వెల్లడించకూడదని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగను ఆనందంగా జరుపుకుంటూనే భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని, పోలీసు శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: థార్ కార్ల రేసింగ్.. ఒక ప్రాణం బలి!  

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *