అక్షరటుడే, వెబ్డెస్క్ : e-HRMS | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇ–హెచ్ఆర్ఎంఎస్ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
డిజిటల్ పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక సంస్కరణలు తెచ్చింది. తాజాగా IFMISలో భాగంగా ఎలక్ట్రానిక్ మానవ వనరుల నిర్వహణ వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల మానవ వనరుల నిర్వహణకు ప్రత్యేక డిజిటల్ వ్యవస్థ రూపొందించింది. అన్ని ప్రభుత్వ శాఖలను ఇ–హెచ్ఆర్ఎంఎస్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. సమీకృత ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ (IFMIS)తో ఇ–హెచ్ఆర్ఎంఎస్ అనుసంధానం చేయనుంది.
ఇది కూడా చదవండి : Dasara Home Safety | పండగకు ఊరెళ్తున్నారా.. జాగ్రత్త..: ఎస్పీ రాజేష్ చంద్ర