Kaleshwaram Project | కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన హరీశ్​రావు : ఎంపీ కిరణ్​కుమర్​ రెడ్డి

మాజీ మంత్రి హరీశ్​రావుపై కాంగ్రెస్​ ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Project | మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao)పై కాంగ్రెస్​ ఎంపీ చామల కిరణ్​కుమార్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందన్నారు. హరీశ్​ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కాళేశ్వరం కూలేశ్వరం చేశారని విమర్శించారు.

గోదావరి జలాలను ఎత్తిపోయాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్​చేసిన విషయం తెలిసిందే. నిత్యం 20 వేల క్యూసెక్కుల జలాలు మేడిగడ్డ నుంచి వృథాగా దిగువకు పోతున్నాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా ఎంపీ చామల కౌంటర్​ ఇచ్చారు. హరీష్ రావుకు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ గురించి మాట్లాడితే కోపం వస్తుందని ఎద్దేవా చేశారు. తాఉ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళలో వాటర్ లెవల్స్ గురించి మాట్లాడానని చెప్పారు.

Kaleshwaram Project | ఎలా ఎత్తిపోయాలి

మేడిగడ్డ నుంచి 20 వేల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని హరీశ్​రావు అంటున్నారని, వాటిని ఎలా ఎత్తిపోయాలని ఎంపీ ప్రశ్నించారు. నీరు ఎత్తిపేసేంత నీటిమట్టం లేదన్నారు. వచ్చే నీటిని నిల్వ చేసి, ఎత్తిపోదామంటే బ్యారేజీ కూలిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందనే విషయం తెలంగాణ ప్రజలకు, హరీశ్​రావుకు తెలియాదా అని అన్నారు. అలాంటప్పుడు నీటిని ఎలా లిఫ్ట్​ చేయాలన్నారు.

Kaleshwaram Project | అక్కడ పంపులు నడుస్తున్నాయి

మేడిగడ్డ కింద దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ లో పంపులు నడుస్తున్నాయని ఎంపీ చామల తెలిపారు. మొత్తం నీరు ఏపీకి వెళ్లడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన దరిద్రం వలనే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరిలో నీళ్లన్నీ కిందకు వెళలిపోవడానికి బీఆర్​ఎస్​ కారణమన్నారు.

ఇది కూడా చదవండి..: Arnab Cyclone | దూసుకొస్తున్న తుపాన్​ ముప్పు.. రేపు తీరం దాటనున్న ‘అర్నబ్​’

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *