అక్షరటుడే వెబ్‌డెస్క్: Malabar Gold Fraud | ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ ‘మలబార్ గోల్డ్ & డైమండ్స్’ (Malabar Gold & Diamonds) బిలాస్‌పూర్ షోరూమ్‌లో కస్టమర్‌ను నిలువునా మోసం చేసేందుకు యంత్రం రీడింగ్ మార్చిన వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ బంగారాన్ని 20 క్యారెట్లుగా చూపిస్తూ మోసానికి పాల్పడినట్లు తేలడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు.
Malabar Gold Fraud | అసలేం జరిగింది?
బిలాస్‌పూర్‌కు చెందిన ఒక వినియోగదారుడు తన వద్ద ఉన్న 22 క్యారెట్ల HUID హాల్‌మార్క్ కలిగిన బంగారు బ్రాస్‌లెట్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు మలబార్ గోల్డ్ షోరూమ్‌ను ఆశ్రయించాడు. అక్కడి సిబ్బంది దానిని తమ XRF ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌లో వరుసగా మూడుసార్లు పరీక్షించారు. ప్రతీసారీ ఆ బ్రాస్‌లెట్ కేవలం 20 క్యారెట్లు మాత్రమే ఉందని, దానికి అసలు హాల్‌మార్కే లేదని తేల్చి చెప్పారు.
Malabar Gold Fraud |లోకల్ జ్యువెలర్ ఎంట్రీ..
మలబార్ సిబ్బంది వ్యాఖ్యలపై అనుమానం వచ్చిన కస్టమర్, తాను ఆ ఆభరణాన్ని కొనుగోలు చేసిన స్థానిక జ్యువెలర్‌ను అక్కడికి పిలిపించాడు. ఆయన స్వయంగా వచ్చి HUID నంబర్‌ను చూపించి, వారి ముందే మళ్లీ పరీక్షించాలని గట్టిగా పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక షోరూమ్ ఆపరేటర్ ఆ మెషీన్‌లో ఏదో ఒక ‘సెట్టింగ్’ మార్చి మళ్లీ పరీక్షించగా, ఒక్కసారిగా అదే బ్రాస్‌లెట్ రీడింగ్ 916 (ప్యూర్ 22 క్యారెట్) గా మారింది. ఈ దారుణమైన వ్యత్యాసాన్ని ఆ జ్యువెలర్ తన మొబైల్‌లో వీడియె రికార్డ్ చేశాడు.
Malabar Gold Fraud | పోలీసుల ఎంట్రీ..
ఈ ఘటనపై స్థానిక సరాఫా అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మలబార్ గోల్డ్ షోరూమ్ మేనేజర్, మెషీన్ ఆపరేటర్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మోసానికి వాడిన ప్యూరిటీ టెస్టింగ్ మెషీన్‌తో పాటు, సీసీటీవీ డివిఆర్ (DVR) ను స్వాధీనం చేసుకున్నారు.
Malabar Gold Fraud | జాగ్రత్త అవసరం..
ఒకే బంగారానికి కొద్ది నిమిషాల్లోనే ఏకంగా 8 శాతం మేర విలువ తగ్గిపోవడం, ప్రశ్నిస్తే తప్ప అసలు రీడింగ్ రాకపోవడంపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘నమ్మకం, స్వచ్ఛత’ అంటూ ప్రకటనలు ఇచ్చే ప్రముఖ బ్రాండ్లలో కూడా ఇలాంటి మోసాలు జరగడం గమనార్హం. పాత బంగారం విక్రయించేటప్పుడు లేదా ఎక్స్ఛేంజ్ చేసుకునేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
🚨 The ‘Girlfriend’ Case: FIR Against Malabar Gold!
A customer visited the Malabar Gold showroom in Bilaspur to exchange an old 22-carat HUID-hallmarked gold bracelet.
When tested on the machine, it showed 20-carat purity—every single time, across three separate tests.
However, after the jeweler made some adjustments to the machine, it suddenly displayed ‘916’ (indicating 22-carat gold)!
Following a complaint by the Bullion Association, the police registered an FIR against the showroom manager and the owner of the testing machine. The machine and the DVR have been seized.
The same piece of gold, yet two different readings—depending on who was watching!
If this was a mistake, Malabar Gold must provide an explanation. If it is part of their business model, then the situation is even more serious.
Hey @Grok, how much have people been swindled out of by Malabar Gold through such fraud?
#MalabarGold #GoldScam https://t.co/Xvq2Ili0nT
— Shivlal Patel | राष्ट्रवादी 🇮🇳 (@shivlalpatel18) October 26, 2026
ఇది కూడా చదవండి: Kaleshwaram Project | కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన హరీశ్‌రావు : ఎంపీ కిరణ్‌కుమర్ రెడ్డి