Nerella victims | నేరెళ్ల బాధితులను మోసం చేసిన కాంగ్రెస్​ : కవిత

నేరెళ్ల బాధితులను కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nerella victims | నేరెళ్ల బాధితులను కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. వాళ్ల దు:ఖంతో రేవంత్​రెడ్డి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వారు బాధితులు అనడానికి లేవని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో వారిని హింసిస్తే కాంగ్రెస్ హయాంలోనూ అన్యాయమే జరుగుతోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం, మూడు ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలోని కొందరు సాగించిన దాస్థీకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెరిపేసిందా అని ప్రశ్నించారు. బాధితులపైనే ఉల్టా పెట్టిన కేసులు ఉన్నాయి కానీ వారు బాధితులు అని చెప్పే ఆధారాలు ఎలా మాయం అయ్యాయని ప్రశ్నించారు.

Nerella victims | తలదించుకునే ఘటన

బీఆర్​ఎస్​ హయాంలో రేవంత్​రెడ్డి పదే పదే నేరెళ్ల ఘటనపై మాట్లాడేవారని కవిత గుర్తు చేశారు. 2017 జులైలో నేరెళ్లలో జరిగిన సంఘటన అందరం తలదించుకునే ఘటన అని ఆమె అన్నారు. 8 కుటుంబాలు బాధితులుగా మారాయని చెప్పారు. వారికి న్యాయం జరగాలని పోరాటం చేస్తే కొంతమందికి రూ.ఐదు లక్షలు, కొంతమందికి రూ.10 లక్షల చెక్కులను అందించి సీఎం చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

Nerella victims | రిపోర్టులు మాయం

ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు నేరెళ్ల దళితులను ఇష్టం వచ్చినట్లు కొట్టారని కవిత అన్నారు. ఆ సమయంలో జైలర్ రాసిన రిపోర్టులు, డీఐజీ రవివర్మ బాధితులతో మాట్లాడిన రిపోర్టులు ఎలా మాయం అయ్యాయని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్​ ఇప్పుడు మోసం చేసిందని మండిపడ్డారు. నేషనల్ ఎస్సీ కమిషన్ ప్రజా కోర్టు నిర్వహించిన రిపోర్టులు ఏమయ్యాయని ప్రశ్నించారు. బాధితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి : Asaduddin Owaisi | ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *