Bandi Bhagirath case | బండి భగీరథ్​ కేసు.. సోషల్​ మీడియా పోస్టులపై కేసు నమోదు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath case | పోక్సో కేసు (POCSO Case)లో బండి భగీరథ్​ శనివారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. అతడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు. అయితే ఈ కేసు సందర్భంగా సోషల్​ మీడియాలో ప్రజలు రెండు వర్గాలు విడిపోయి పోస్టులు పెట్టారు.

పోక్సో కేసులో బండి భగీరథ్​కు అనుకూలంగా బాలికదే తప్పు అన్నట్లు పలువురు పోస్టులు చేశారు. ఆమె ఫొటోలు, వీడియోలు సైతం వైరల్ చేశారు. కొందరు భగీరథ్​ను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసులను ప్రశ్నించారు. భగీరథ్​ ముందస్తు బెయిల్ పిటిషన్​ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు (High Court) కొట్టివేసింది. అయితే బెయిల్​ పిటిషన్​ విచారణకు రాకముందు పలువురు సోషల్​ మీడియాలో న్యాయమూర్తిపై పోస్టులు పెట్టారు.

Bandi Bhagirath case | ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్​

బండి భగీరథ్​ ముందస్తు బెయిల్‌ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై సోషల్‌ మీడియాలో అనుచిత ఆరోపణలు చేశారు. బెయిల్‌ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఇస్తారని సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. విచారణ సందర్భంలో సోషల్‌ మీడియా పోస్టులపై జడ్జి మాధవి ప్రస్తావించారు. అనంతరం పలు సోషల్‌ మీడియా పోస్టులపై హైకోర్టు రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చార్మినార్‌ పోలీసులు (Charminar Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పోస్టులతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Bandi Sai Bhageerath Arrest | జ్యుడీషియల్ రిమాండ్‌కు బండి సాయి భగీరథ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *