తెలంగాణBandi Sai Bhageerath Arrest | జ్యుడీషియల్ రిమాండ్‌కు బండి సాయి భగీరథ్

Bandi Sai Bhageerath Arrest | జ్యుడీషియల్ రిమాండ్‌కు బండి సాయి భగీరథ్

నిందితుడు భగీరథ్ కోసం పోలీసులు కరీంనగర్, ఢిల్లీలతో పాటు అతను తిరిగే పలు ప్రాంతాల్లో, అతనికి తెలిసిన వారి ఇళ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు 'లుకౌట్ సర్క్యులర్' (Look out Circular) కూడా జారీ చేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bandi Sai Bhageerath Arrest | పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ అలియాస్ భగీరథ్​ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సైబరాబాద్​ కమిషనర్​ ప్రకటన విడుదల చేశారు.

మే 16 రాత్రి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు వివరించారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Bandi Sai Bhageerath Arrest | కేసు నేపథ్యం

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలైన బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 8, 2026న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 684/2026 కింద కేసు నమోదైంది.

దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పాటు ఇతర సాక్షుల వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి (IO) సేకరించారు. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు తీవ్రతను బట్టి సెక్షన్లను సవరించారు.

భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 64 (2)(m), 74, 75 లతో పాటు పొక్సో (POCSO) చట్టం-2012 లోని సెక్షన్ 5 (1) r/w 6 ను ఈ కేసులో అదనంగా చేర్చారు.

Bandi Sai Bhageerath Arrest | ఉన్నతాధికారుల పర్యవేక్షణ

ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను కూకట్‌పల్లి డీసీపీ (DCP) రితిరాజ్​కు అప్పగించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని సెక్షన్ 183 BNSS కింద నమోదు చేయించారు.

Bandi Sai Bhageerath Arrest | నాకాబందీ.. ఐటీ కారిడార్‌లో లొకేషన్ గుర్తింపు

పరారీలో ఉన్న నిందితుడు భగీరథ్ కోసం పోలీసులు కరీంనగర్, ఢిల్లీలతో పాటు అతను తిరిగే పలు ప్రాంతాల్లో, అతనికి తెలిసిన వారి ఇళ్లలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ‘లుకౌట్ సర్క్యులర్’ (Look out Circular) జారీ చేశారు.

ఈ క్రమంలో, నిందితుడు పోలీస్ అకాడమీ సమీపంలో తిరుగుతున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నాకాబందీ నిర్వహించారు. శనివారం (మే 16) రాత్రి 8:15 గంటల సమయంలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ వద్ద సైబరాబాద్ SOT (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) నిందితుడిని అదుపులోకి తీసుకుని, పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించింది.

Bandi Sai Bhageerath Arrest | నేరం అంగీకారం – రిమాండ్

పోలీస్ స్టేషన్‌లో సాక్షుల సమక్షంలో దర్యాప్తు అధికారి నిందితుడిని విచారించగా, తాను నేరానికి పాల్పడినట్లు సాయి భగీరథ్ అంగీకరించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తెలిపారు. దీంతో దర్యాప్తు అధికారి అతడిని అధికారికంగా అరెస్టు చేశారు.

అనంతరం నిందితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

MP Arvind Vs MLA Sanjay | “ఎమ్మెల్యే సంజయ్ ‘జగిత్యాల జోకర్’.. రాజకీయ అంతు చూసేవరకు వదిలిపెట్టను”.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...

Youth Drowning | ప్రాణం తీసిన ఈత సరదా.. కుంటలో మునిగి యువకుడి మృత్యువాత

అక్షరటుడే, బాన్సువాడ: Youth Drowning | ఎండ వేడిని తట్టుకోలేక స్నేహితులతో...

Hyderabad Heavy Rain | హైదరాబాద్​లో భారీ వర్షం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Heavy Rain | హైదరాబాద్​ నగరంలో...