Telangana New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.2 వేలు..

తెలంగాణలో కొత్తగా పింఛన్లు మంజూరై నగదు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana New Pensions | తెలంగాణలో కొత్తగా పింఛన్లు మంజూరై నగదు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 26న) కొత్త చేయూత పింఛన్ల నగదును విడుదల చేయనుంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. సీఎం విడుదల చేసిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల నుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్ అందించనున్నారు.

Telangana New Pensions | లబ్ధిదారులకు ప్రయోజనం..

రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి 4.72 లక్షల మంది అర్హులను గుర్తించారు. వీరందరికీ ఇప్పటికే మంజూరు పత్రాలను అందించారు. గతంలో పోస్టాఫీసుల ద్వారా జరిగే పంపిణీ విధానాన్ని మార్చి, ప్రస్తుతం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోనే రూ.2 వేల చొప్పున జమ చేస్తున్నారు.

Telangana New Pensions | చీరల పంపిణీ షురూ..

పింఛన్ల విడుదలతో పాటు అచ్చంపేట వేదిక నుంచే ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వాస్తవానికి నవంబర్ 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున ఈ పథకాన్ని మొదలుపెట్టాల్సి ఉన్నప్పటికీ, అదే రోజు ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం ఉండటంతో వాయిదా వేశారు.

Telangana New Pensions | రేషన్ షాపుల వద్ద పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని మండల కేంద్రాలకు చీరలు చేరుకున్నాయి. ప్రతి గ్రామంలోని రేషన్ షాపులు, ప్రత్యేక పంపిణీ కేంద్రాల వద్ద మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి చీరలను పొందవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది.

ఇది కూడా చదవండి:  SP Candidate List | కాంగ్రెస్​కు అఖిలేష్​ యాదవ్​ షాక్​.. తొలి జాబితా విడుదల

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *