అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi Gang Rape Case | ఢిల్లీ (Delhi)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఆమె తోటి ఉద్యోగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
తూర్పు ఢిల్లీలోని ప్రీత్ విహార్‌లో మంగళవారం తెల్లవారుజామున ఒక కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు తన సహోద్యోగులతో కలిసి సోమవారం రాత్రి సల్తానాతే కేఫ్‌లో జరిగిన ఒక పార్టీకి హాజరయ్యారు. వారిలో ఒకరి వద్ద కేఫ్ తాళం చెవి ఉండటంతో, రాత్రి 11:30 గంటలకు కేఫ్ మూసివేసిన తర్వాత మద్యం తాగుతూ, నృత్యం చేస్తూ అక్కడే ఉన్నారు. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Delhi Gang Rape Case | సహకరించిన మహిళలు
పార్టీ సమయంలో ఇద్దరు పురుషులు తనపై అత్యాచారానికి పాల్పడగా, బృందంలోని మిగతావారు వారికి సహకరించారని బాధితురాలు ఆరోపించారు. అందులో మహిళలు సైతం ఉన్నారు. దీంతో పోలసీఉలు నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి..: Train Delay Compensation | ట్రైన్ ఆలస్యం.. రూ.63 వేల ఫైన్ వేసిన వినియోగదారుల కమిషన్