Bhilai Chemical Factory Fire | రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bhilai Chemical Factory Fire | ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భిలాయ్ హత్‌ఖోజ్ పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్​ పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల కారణంగా దట్టమైన నల్లటి పొగ కొన్ని కిలోమీటర్ల మేర ఆకాశంలో వ్యాపించడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

Bhilai Chemical Factory Fire | 50కి పైగా కెమికల్ డ్రమ్స్‌..

వెల్డింగ్ పనుల సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడటంతో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 50కి పైగా కెమికల్ డ్రమ్స్‌తో పాటు రెండు ట్యాంకర్లు దగ్ధమయ్యాయి.

సుమారు ఎనిమిది గంటలపాటు..

అగ్నిమాపక సిబ్బంది సుమారు ఎనిమిది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం, ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: By-Election Counting | ఉప ఎన్నికల కౌంటింగ్​.. మూడు స్థానాల్లో బీజేపీ, ఒక చోట టీవీకే ముందంజ..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *