అక్షరటుడే, వెబ్డెస్క్ : CJP Protest | నీట్ (NEET) పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీతో మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను సీజేపీ తిరస్కరించింది.
చర్చల కోసం ప్రభుత్వం నాలుగు ప్రతిపాదనలను పంపిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. తాము ఏ సమయంలోనైనా చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తన ఆఫీసులో అయినా.. ఇంట్లో అయినా చర్చలకు సిద్ధమన్న జేపీ నడ్డా (JP Nadda) తెలిపారు. అఇయతే ఇల్లు, ఆఫీసు కాకుండా.. తటస్థ వేదికపై చర్చిద్దామని సీజేపీ నేత సౌరవ్ దాస్ తెలిపారు. జంతర్ మంతర్‌లో లేదా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వేదికగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
CJP Protest | ఇద్దరం హాజరు అవుతాం
కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, తాను చర్చలకు వస్తామని జితేంద్ర సింగ్ తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతామన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది ఒక భాగం అని పేర్కొన్నారు. CJP నేత సౌరవ్ దాస్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చలు జరపాలని కోరుకుంటున్నారని పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. అయితే తాము ఎవరి ఇంటికి, కార్యాలయానికి వెళ్లమన్నారు. మంత్రులు ప్రజల మధ్యకు రావాలని డిమాండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : KTR Legal Notice | అవినీతిపై సిట్, సీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి సిద్ధమా?: కేటీఆర్