IDFC First Bank Q1 Results | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దూకుడు.. ఇంట్రాడేలో 10 శాతం జంప్

ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను సాధించడంతో సోమవారం ఇంట్రాడేలో ఆ కంపెనీ షేర్లు సుమారు 10 శాతం పెరిగాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IDFC First Bank Q1 Results | ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్‌లలో ఒకటైన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC First Bank) ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మొదటి త్రైమాసికంలో బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది.

IDFC First Bank Q1 Results | ఫలితాలిలా..

  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ కాలంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ పన్ను తర్వాత లాభం (ప్యాట్ ) రూ. 1,075 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ. 463 కోట్లతో పోలిస్తే 132.4 శాతం అధికం.
  • గతేడాది జూన్ 30 నాటికి రూ. 5,10,031 కోట్లుగా ఉన్న మొత్తం కస్టమర్ వ్యాపారం.. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ. 6,04,776 కోట్లకు పెరిగింది. ఇందులో 18.6 శాతం వృద్ధి నమోదయ్యింది.
  • బ్యాంక్ రుణాలు, అడ్వాన్స్‌లు 20.6 శాతం వృద్ధితో రూ. 2,53,233 కోట్లనుంచి రూ. 3,05,370 కోట్లకు పెరిగాయి.
  • బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏ 1.97 శాతం నుంచి 1.51 శాతానికి, నెట్ ఎన్పీఏ 0.55 శాతం నుంచి 0.44 శాతానికి మెరుగుపడింది.
  • సమీక్షా త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ 5.71 నుంచి 5.96 శాతానికి పెరిగింది.

IDFC First Bank Q1 Results | స్టాక్ ధరలో పరుగులు..

ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు సోమవారం ఉదయం దూకుడును ప్రదర్శించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఇంట్రాడేలో సుమారు 10 శాతం మేర పెరిగి అప్పర్ సర్క్యూట్ కు చేరువయ్యింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో లాభాలు తగ్గాయి. ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఒక్కో ఈక్విటీ షేరు ధర 6 శాతం లాభంతో రూ. 85.62 వద్ద ఉంది.

ఇది కూడా చదవండి..: Exam Reforms Task Force | పరీక్షల సంస్కరణకు టాస్క్​ఫోర్స్​.. మరో వీడియో విడుదల చేసిన మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *