అక్షరటుడే వెబ్‌డెస్క్: Infosys CEO | దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ( Infosys )నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్‌ను (నియమిస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకం 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సలీల్ పరేఖ్.. తన పదవీకాలం ముగిసే వరకు (2027 మార్చి 31) ఆ స్థానంలో కొనసాగుతారు. 2018లో ఇన్ఫోసిస్ బాధ్యతలు చేపట్టిన సలీల్ పరేఖ్.. కంపెనీ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన నాన్-ఫౌండర్ సీఈవోగా రికార్డు సృష్టించనున్నారు.
Infosys CEO | బోర్డు ప్రకటన..
ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని మాట్లాడుతూ.. ఐటీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంపెనీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా ఆశిష్ కుమార్ దాస్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ విలువలు, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుతూ ఆయన సంస్థను విజయవంతంగా నడిపిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, గత తొమ్మిదేళ్లుగా కంపెనీ అభివృద్ధికి అంకితభావంతో సేవలందించిన ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్‌కు బోర్డు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: Rice Mill Raid | సీఎంఆర్ ఇవ్వని రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటాం..