అక్షరటుడే వెబ్‌డెస్క్: 9/11 CIA Documents | అమెరికాపై 9/11 ఉగ్రదాడులు జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) కొన్ని సంచలన రహస్య పత్రాలను బయటపెట్టింది. అప్పట్లో అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ అధిపతి ఒసామా బిన్ లాడెన్ దాడులు చేయాలని భావించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉందని ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది. బిన్ లాడెన్‌కు సంబంధించిన 70కి పైగా ప్రెసిడెన్షియల్ ఇంటెలిజెన్స్ బ్రీఫ్‌లను, వంద పేజీలకు పైగా ఉన్న కీలక సమాచారాన్ని సీఐఏ తాజాగా విడుదల చేసింది.
9/11 CIA Documents | హిట్ లిస్ట్‌లో భారత్..
ఆగస్టు 28, 1998 నాటి ప్రెసిడెన్షియల్ బ్రీఫ్ ప్రకారం.. భారత్‌తో ( India )పాటు మరికొన్ని దేశాలపై దాడులు నిర్వహించేందుకు బిన్ లాడెన్ ప్లాన్ చేసినట్లు తేలింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఈజిప్ట్, కువైట్, సౌదీ అరేబియా, యెమెన్, ఉగాండా, నైజీరియా వంటి దేశాల పేర్లు కూడా ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెమోలోని కొన్ని భాగాలను అధికారులు సెన్సార్ చేశారు. “బిన్ లాడిన్ టెర్రరిస్ట్ నెట్‌వర్క్ స్టిల్ ఎ థ్రెట్” అనే హెడ్డింగ్‌తో ఉన్న ఆ పత్రంలో, ఖచ్చితమైన మూలం వివరాలు వెల్లడించలేదు. అలాగే భారత్‌లో ఏ తేదీన దాడి చేయాలనే దానిపై స్పష్టమైన ఆపరేషనల్ ప్రణాళికలు ఏవీ లభించలేదు. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బిన్ లాడెన్, ఇతర ఉగ్రవాద నాయకులు అమెరికా దాడులను తట్టుకుని జీవించి ఉన్నారని, వారి కమ్యూనికేషన్ నెట్‌వర్క్ చెక్కుచెదరలేదని ఆ పత్రాలు అంచనా వేశాయి. ఈ ఉగ్రవాద సంస్థ కొన్ని శిబిరాల్లో మళ్లీ శిక్షణను ప్రారంభించిందని, మరికొన్నింటిని వేరే ప్రాంతాలకు మారుస్తున్నట్లు ఆ పత్రాలు వెల్లడించాయి.
9/11 CIA Documents | అమెరికా మాజీ అధ్యక్షులే టార్గెట్..
ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్-ఖైదా శిబిరాలపై అమెరికా క్షిపణి దాడికి కొన్ని గంటల ముందే, అమెరికా అలాగే బ్రిటన్‌లపై మరిన్ని దాడులు చేసేందుకు బిన్ లాడెన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఐఏ తెలిపింది. కనీసం 60 దేశాల్లో ఉన్న వ్యక్తులు, మిత్రపక్షాల ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దాడుల కోసం ఆయన ఉపయోగించుకోవచ్చని అందులో పేర్కొన్నారు. 1998 నుంచి 2001 వరకు అమెరికాపై జరగబోయే టెర్రర్ అటాక్ గురించి, అప్పటి అమెరికా మాజీ అధ్యక్షులను సీఐఏ పలుమార్లు అప్రమత్తం చేసినట్లు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. బిల్ క్లింటన్ అధ్యక్ష పదవి కాలం నుంచి జార్జ్ డబ్ల్యూ బుష్ హయాం వరకు ఉన్న కాలానికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి.
9/11 CIA Documents | నాలుగు విమానాల హైజాక్..
సెప్టెంబర్ 11, 2001న 19 మంది అల్-ఖైదా ఉగ్రవాదులు నాలుగు విమానాలను హైజాక్ చేసి ఊహించని వినాశనాన్ని సృష్టించారు. ఇందులో రెండు విమానాలు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను ఢీకొనడంతో ఆ ఎత్తైన భవనాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. మూడో విమానం పెంటగాన్‌ను ఢీకొనగా.. నాల్గవ విమానం వైట్‌హౌస్ లేదా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు భావించారు. అయితే ప్రయాణికులు ఎదురు తిరగడంతో ఆ విమానం పెన్సిల్వేనియాలోని ఒక మైదానంలో కూలిపోయింది.
ఇది కూడా చదవండి: BRICS Vision Modi | విన్-విన్ బ్రిక్స్ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ