Bangladesh transit corridor protests | భారత్‌కు ట్రాన్సిట్ కారిడార్​పై బంగ్లాదేశ్‌లో ప్రతిపక్షాల తీవ్ర ఆగ్రహం!

జపాన్ ఆర్థిక, మౌలిక సదుపాయాల సహకారంతో బంగ్లాదేశ్ మీదుగా ఈ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు నిరూపించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bangladesh transit corridor protests | బంగ్లాదేశ్ మీదుగా భారతదేశానికి ‘ట్రాన్సిట్ కారిడార్’ కల్పించే ప్రతిపాదనపై పొరుగు దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది.

ఈ అంశంపై అక్కడి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన బాట పట్టాయి. భారత్‌తో ఉన్న రవాణా మరియు దౌత్య ఒప్పందాలపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి.

Bangladesh transit corridor protests | నేషనల్ సిటిజన్ పార్టీ హెచ్చరికలు

బంగ్లాదేశ్‌కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ ఈ పరిణామాలపై ఘాటుగా స్పందించింది. గంగా నది జలాల పంపిణీ ఒప్పందాన్ని అత్యంత న్యాయబద్ధంగా, బంగ్లాదేశ్ ప్రయోజనాలకు భంగం కలగకుండా పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

చట్టవిరుద్ధంగా లేదా అక్రమ పద్ధతుల్లో భారత్‌కు ట్రాన్సిట్ కారిడార్‌ను కట్టబెట్టాలని చూస్తే సహించేది లేదని, దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Bangladesh transit corridor protests | డిసెంబర్‌లో ముగియనున్న కీలక ఒప్పందం

రెండు దేశాల మధ్య ఉన్న అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒప్పందం పొడిగింపు లేదా సవరణలపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ తరహా నిరసనలు వెల్లువెత్తడం గమనార్హం.

Bangladesh transit corridor protests | ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ.. జపాన్ సహకారం!

భారతదేశం తన ఈశాన్య (North-East) రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర, మేఘాలయ తదితర ప్రాంతాలకు వేగవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని భావిస్తోంది. జపాన్ ఆర్థిక, మౌలిక సదుపాయాల సహకారంతో బంగ్లాదేశ్ మీదుగా ఈ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రణాళికలు నిరూపించింది.

అయితే బంగ్లాదేశ్‌లో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత ఈ ప్రాజెక్టుకు ప్రధాన అవరోధంగా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాలు భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *