అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rahul Gandhi Speech | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రసగించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, అమిత్ షాపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఎంపీలు అందరు సభకు రావాలని కాంగ్రెస్ సందేశం పంపింది. అయినా కూడా ఓ ఎంపీ రాహుల్ ప్రసంగానికి హాజరు కాలేదు.
పంజాబ్బ్లోని జలంధర్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగానికి హాజరు కాకుండా, ఫరీద్‌కోట్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ గ్రూపుకు నేతృత్వం వహిస్తున్న అమృత్‌సర్ ఎంపీ గుర్జిత్ సింగ్ ఔజ్లా, గాంధీ ప్రసంగ సమయంలో సభకు హాజరు కావాలని ఎంపీలందరికీ వాట్సాప్ సందేశం పంపినట్లు సమాచారం. అయినా కూడా చన్నీ రాకపోవడం పార్టీలో వర్గ విభేదాలకు నిదర్శనం. ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాల వివాదంపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ విశ్వవిద్యాలయం వెలుపల చన్నీ కాంగ్రెస్ ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ నిరసనలో చన్నీకి సన్నిహితులుగా భావించే మాజీ ఎమ్మెల్యే కుశల్‌దీప్ సింగ్ ధిల్లాన్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Rahul Gandhi Speech | ఒంటరిగా..
చన్నీ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. బుధవారం రాజా వారింగ్ పార్లమెంట్ ఆవరణలో ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంజాబ్ ఎంపీలతో నిరసన చేపట్టారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్‌జ్యోత్ సింగ్ బేన్స్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కానీ చన్నీ మాత్రం ఫరీద్‌కోట్‌లో ఒంటరిగా నిరసన చేపట్టడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: CRPF Chief | నిర్భయంగా పని చేయండి.. నేను చూసుకుంటా: సీఆర్పీఎఫ్ చీఫ్