Flight Ticket Price Hike | పెరిగిన విమాన ధరలు.. నేటి నుంచే అమలు

విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులపై భారం మోపాయి.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Flight Ticket Price Hike | విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రముఖ విమానయాన సంస్థలు ప్రయాణికులపై భారం మోపాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఆకాశ ఎయిర్ సంస్థలు దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన సర్‌ఛార్జీ(Fuel Surcharge) పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ కొత్త సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

Flight Ticket Price Hike | సర్‌ఛార్జీల వివరాలు..

విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ ఖర్చుల్లో ఇంధన వాటా ఏకంగా 40 శాతం ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. దీనివల్ల దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే దూరాన్ని బట్టి టికెట్‌పై రూ. 400 నుంచి రూ. 1,200 వరకు ఇంధన సర్‌ఛార్జీ ఉండనుంది. అలాగే అంతర్జాతీయ విమాన టికెట్లపై గమ్యస్థానం, దేశాన్ని బట్టి 55 నుంచి 215 డాలర్ల వరకు సర్‌ఛార్జీ పడనుంది.

Flight Ticket Price Hike | ఆకాశ ఎయిర్ బాదుడు..

ఆకాశ ఎయిర్ సంస్థ దేశీయ విమాన సర్వీసులపై ఇంధన సర్‌ఛార్జీని తిరిగి విధిస్తుండగా, అంతర్జాతీయ సర్వీసులపై ఇప్పటికే ఉన్న సర్‌ఛార్జీలను మరింత పెంచింది. దేశీయ టికెట్లపై దూరాన్ని బట్టి రూ. 375 నుంచి రూ. 1,150 వరకు, అంతర్జాతీయ సర్వీసులపై సవరించిన సర్ఛార్జీ రూ. 2,500 వరకు ఉండనున్నట్లు సంస్థ తెలిపింది.ఇంధన ధరల పెరుగుదల కారణంగా విమాన టికెట్లు ప్రియమవ్వడంతో ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

ఇది కూడా చదవండి..: Bhilai Chemical Factory Fire | రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *