Haryana youth murder | 10 సెకన్లలో 30 బుల్లెట్లు.. ఇంటి ముంగిటే యువకుడి దారుణ హత్య!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Haryana youth murder | హరియాణాలో మరోమారు గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. నలుగురు సాయుధ దుండగులు ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఒక యువకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారు. కేవలం 10 సెకన్ల వ్యవధిలోనే సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిపి ఆ యువకుడిని అక్కడికక్కడే మట్టుబెట్టారు.

Haryana youth murder | అసలేం జరిగిందంటే?

ఝజ్జర్ జిల్లాలోని సుబానా గ్రామానికి చెందిన హితేశ్ అలియాస్ గోలు అనే యువకుడు తన ఇంటి నుండి బయటకు వచ్చిన తరుణంలో ఈ ఘోరం జరిగింది. అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు దుండగులు ఒక్కసారిగా అతడిపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఊపిరి పీల్చుకునే లోపే స్వల్ప వ్యవధిలో బుల్లెట్ల వర్షం కురిపించారు. తీవ్ర గాయాలపాలైన హితేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Haryana youth murder | గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదర ముఠా పనే..!

ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘోరానికి కుఖ్యాత గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదర ముఠానే కారణమని తెలుస్తోంది. ఆ గ్యాంగ్‌కు చెందిన నలుగురు సభ్యులే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. పాత కక్షలు లేదా గ్యాంగ్ ల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Haryana youth murder | భయాందోళనలో స్థానికులు

పగటిపూట, అదీ నివాసాల మధ్య ఇంతటి దారుణ హత్య జరగడంతో సుబానా గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *