Navodaya Admissions 2027 | నవోదయ ప్రవేశాలకు వారం రోజులే గడువు..

నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు గడువు వారం రోజులే ఉందని ప్రిన్సిపాల్​ రాంబాబు తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Navodaya Admissions 2027 | నవోదయ విద్యాలయంలో (Navodaya Vidyalaya) ప్రవేశాలకు గడువు వారం రోజులే ఉందని నిజాంసాగర్​ విద్యాలయ ప్రిన్సిపాల్​ రాంబాబు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Navodaya Admissions 2027 | 2027–2028 విద్యాసంవత్సరానికి గాను..

2027–2028 విద్యాసంవత్సరానికి గాను 9,11, తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గాను ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్​ తెలిపారు. దీని కోసం ఆన్​లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ 15వతేదీ ముగుస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు చివరి తేదీలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు. విద్యార్థులు https://cbseitms.nic.in/2026/nvsix_9/, https://cbseitms.nic.in/2026/nvsxi_11 వెబ్‌సైట్‌లో తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తులను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Girl Kidnapping Case | బాలిక కిడ్నాప్​ కేసులో నిందితుడికి ఏడేళ్ల కారాగారం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *