అక్షరటుడే, వెబ్డెస్క్ : Train Delay Compensation | రైలు ఆలస్యంగా రావడంతో ఓ జంట తమ ఫ్లైట్ మిస్ అయ్యారు. ఫలితంగా హోటల్లో బస చేయడంతో పాటు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనిపై వారు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కమిషన్ ఆ దంపతులకు రూ.63 వేల జరిమానా చెల్లించాలని నార్నర్న్ రైల్వేస్ను ఆదేశించింది.
మోహిత్ సింగ్ భావు, దామిని బిల్లోరియాల దంపతులు. వీరు 2022 డిసెంబర్ 19న జమ్మూ నుండి ‘ఢిల్లీ (Delhi) దురంతో ఎక్స్‌ప్రెస్’లో బయలుదేరారు. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 3:55 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా, దాదాపు నాలుగు గంటల ఆలస్యంతో ఉదయం 7:50 గంటలకు చేరుకుంది. వారు అప్పటికే ఢిల్లీ నుంచి గౌహతికి విమానంలో వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. రైలు ఆలస్యం కావడంతో కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యారు.
Train Delay Compensation | రూ.38 వేల అదనపు ఖర్చు
రైలు ఆలస్యం కారణంగా తాము కొత్తగా విమాన టిక్కెట్ల కోసం రూ. 35,699, ఢిల్లీలో హోటల్ బస కోసం రూ. 2,500 వెచ్చించాల్సి వచ్చిందని, మొత్తం రూ. 38,199 అదనపు ఖర్చు అయిందని వారు కమిషన్‌కు తెలిపారు. ఆర్థిక నష్టానికి రూ. 60వేలు, మానసిక వేదన, అసౌకర్యానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరారు. అయితే పొగమంచు కారణంగా రైలు ఆలస్యం అయిందని రైల్వే అధికారులు తెలిపారు. అందుకు తగిన ఆధారాలు కమిషన్ ముందు ఉంచడంలో విఫలం అయింది. దీంతో ఆ జంటకు రూ. 63,199 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి..: SP Candidate List | కాంగ్రెస్కు అఖిలేష్ యాదవ్ షాక్.. తొలి జాబితా విడుదల