అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SP Candidate List | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన సమాజ్‌వాది పార్టీ షాక్ ఇచ్చింది. ఓ వైపు సీట్ల పంపకంపై చర్చలు జరుగుతుండగానే.. ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఎస్పీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతుండగా.. ఎస్పీ మాత్రం అందుకు సుముఖంగా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఓటు షేర్ లేదని, ఎక్కువ సీట్లు ఇవ్వలేమని చెబుతోంది. ఇటీవల ఢిల్లీలో రెండు పార్టీల నేతలు సీట్ల పంపకంపై చర్చించారు. అయితే ఎలాంటి ఫలితం లేకుండానే 15 నిమిషాల్లోనే అది ముగిసింది. దీంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా ఎస్పీ ఐదుగురితో కూడిన జాబితా విడుదల చేయడం గమనార్హం. అది కూడా కాంగ్రెస్ ఆశిస్తున్న స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడంతో సీట్ల పంపకం చర్చలు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నాయి.
SP Candidate List | 26 సీట్లు ఇస్తాం
ఎస్పీ నిర్ణయం కాంగ్రెస్ నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసినట్లు సమాచారం. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో కాంగ్రెస్ మొదల 181 సీట్లు అడిగింది. అనంతరం 100కు పైగా ఇవ్వాలని తగ్గింది. అయితే అఖిలేష్ యాదవ్ మాత్రం 26 సీట్లు ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. చర్చల మధ్యలో ఐదుగురు అభ్యర్థులను ప్రకటించడం ఉత్తరప్రదేశ్‌లోని కాంగ్రెస్ నాయకులకు మరింత ఆగ్రహం తెప్పించింది. ఐదుగురు అభ్యర్థులలో నలుగురు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. వీరిలో కాంగ్రెస్ యూపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గమైన సహారన్‌పూర్ కూడా ఉంది.
SP Candidate List | కాంగ్రెస్ విమర్శలు
అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ మసూద్ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. చర్చలు ఖరారు కాకముందే వారు పేర్లను ఎలా విడుదల చేయగలరు అని ప్రశ్నింంచారు. అవే స్థానాల నుంచి కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ప్రకటించగలదని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి..: Teacher Arrested | విద్యార్థినికి అసభ్యకర సందేశాలు.. ఉపాధ్యాయుడు అరెస్టు