Basara Fire Accident | కూతురి పెళ్లి కోసం దాచిన సొమ్ము దగ్ధం

నిర్మల్‌ జిల్లా బాసరలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara Fire Accident | నిర్మల్‌ జిల్లా (Nirmal District) బాసరలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూతురి పెళ్లి కోసం దాచిన నగదు, బంగారం కాలిబూడిద అయ్యాయి. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

బాసర రవీంద్రపూర్‌ కాలనీలోని బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. షేక్‌ ఇబ్రహీం ఇంట్లో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. మంటల్లో రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారం కాలిపోయింది. తమ కూతురు పెళ్లి కోసం సిద్ధం చేసిన నగదు కాలిపోయిందని బాధిత కుటుంబం వాపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు.

Basara Fire Accident | పరిశీలించిన అధికారులు

సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇబ్రహీం కుటుంబాన్ని ఆదుకుంటామని తహశీల్దార్ పవన్​ చంద్ర తెలిపారు. ఆర్ఐ అభిమన్యు, జీపీవో శంకర్ పంచనామా చేశారు. రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారం, వెండి, పెళ్లి సామగ్రి, ఫర్నిచర్, కాలిపోయాయని వెల్లడించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి..: Siddhula Gutta | సిద్ధుల గుట్టపై 1వ శతాబ్దం నాటి బ్రాహ్మీ శాసనం.. సోషల్ మీడియాలో వైరల్..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *