Teacher Arrested | విద్యార్థినికి అసభ్యకర సందేశాలు.. ఉపాధ్యాయుడు అరెస్టు

ఓ విద్యార్థినికి అసభ్యకరమైన మెసెజ్​లు పంపిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Teacher Arrested | పాఠాలు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయులు దారితప్పాడు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన అతడు కీచకుడిగా మారాడు. మంచి మాటలు చెప్పి.. ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఆ సార్​ ఓ విద్యార్థినికి అసభ్యకరంగా మెసెజ్​లు పంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో చోటు చేనసుకుంది. పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

Teacher Arrested | బయటకు వెళ్దామని..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గునాలో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆ ఉపాధ్యాయుడు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపాడు. నరేంద్ర కుష్వాహ అనే ఆ ఉపాధ్యాయుడు, తనతో బయటకు రావాలని కోరాడని ఆమె ఆరోపించింది. సాయంత్రం 5 గంటలకు ఖాళీగా ఉన్నావా? బయటకు వెళ్దాం. రాత్రి 8 గంటలకల్లా తిరిగి వచ్చేయొచ్చు మెసెజ్​ చేసినట్లు తెలిపింది. నవంబర్ 14న అతడు మొదట మెసెజ్​లు చేశాడు. అనంతరం నవంబర్ 18 నుండి 20 మధ్య కాలంలో ఆయన వరుసగా అసభ్యకరమైన సందేశాలు పంపారని ఆరోపించింది.

Teacher Arrested | నన్ను చూసుకోవాలి

ఆ ఉపాధ్యాయుడు సదరు విద్యార్థిని తను చెప్పిన దుస్తులే ధరించాలని కోరాడు. “నువ్వు నన్ను చూసుకోవాలి” అన్నాడని పేర్కొంది. తనను “నిద్రపుచ్చమని” మెసేజ్​ చేశాడు. పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్‌లో ఆయనకు ఒక రహస్య గది ఉందని విద్యార్థిని ఆరోపించింది. విద్యార్థి ఆరోపణలతో అధికారులు విచారణ చేపట్టారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Rajiv Gandhi Assassination | రాజీవ్​ గాంధీ హత్యపై రాహుల్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *