Plastic Cover Raids | ప్లాస్టిక్​ కవర్లు వినియోగిస్తున్న దుకాణాలపై దాడులు

నగరంలో ప్లాస్టిక్​ కవర్లు వినియోగిస్తున్న పలు దుకాణాలు, జ్యూస్, టిఫిన్​​ సెంటర్లపై మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు దాడులు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Plastic Cover Raids | నగరంలో ప్లాస్టిక్​ కవర్లు వినియోగిస్తున్న పలు దుకాణాలు, జ్యూస్, టిఫిన్​​ సెంటర్లపై మున్సిపల్​ కార్పొరేషన్​ (Nizamabad Municipal Corporation) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు దుకాణాలకు జరిమానాలు విధించారు.

Plastic Cover Raids |మున్సిపల్​ కమిషనర్​ ఆదేశానుసారం..

మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం నగరంలోని పలు టిఫిన్ సెంటర్లు, కిరాణా షాపులు, హోటళ్లలో మున్సిపల్​ అసిస్టెంట్​ కమిషనర్​ నసీర్​ అహ్మద్​ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్​ కవర్లు(Plastic Ban) వినియోగిస్తున్నట్లు గుర్తించి జరిమానాలు విధించారు. మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ, శానిటరీ ఇన్​స్పెక్టర్​ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : భార్యను హత్య చేసి.. తలను ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *