Ganesh Festival Safety | గణేష్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి

గణేష్​ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని పెద్ద కొడప్​గల్​ ఎస్సై అరుణ్​కుమార్​ సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, పెద్దకొడప్​గల్​: Ganesh Festival Safety | గణేష్​ ఉత్సవాలను (Ganesh Utsav) శాంతియుతంగా జరుపుకోవాలని పెద్ద కొడప్​గల్​ ఎస్సై అరుణ్​కుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో (Peddakodapgal) గణేష్​ మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు.

Ganesh Festival Safety | ప్రజలు సహకరించాలి

ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. గణేష్​ మండపాల వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేయాలని సూచించారు. మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని.. శాంతియుతంగా తొమ్మిదిరోజులు కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. ఒకవేళ డీజేలు పెడితే సీజ్​​ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా వర్షాకాలం కాబట్టి సురక్షితమైన ప్రాంతాల్లోనే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు వినోద్ కుమార్, మహాదేవి శివకుమార్, ఉప సర్పంచ్ నాగరాజు, గణేష్ మండపాల నిర్వాహకులు  పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 సీజన్ మొదలైంది. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *