Bhupathi Reddy Comments | బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ తాతమధు వ్యాఖ్యలపై ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్

ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) స్పీకర్ ప్రసాద్ కుమార్​పై చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ఖండించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Bhupathi Reddy Comments | ఎమ్మెల్సీ తాత మధుసూదన్ (తాత మధు) (Thatha Madhu)అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు.

Bhupathi Reddy Comments | నీచమైన వ్యాఖ్యలు

భూపతిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నీచమైన రాజకీయంగా తాత మధు వ్యాఖ్యలను అభివర్ణించారు. గౌరవప్రదమైన ఓ స్పీకర్​ను అవమానించే విధంగా సభ వెలుపల వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలపై బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్(KCR) క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా తాత మధు సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొన్నారు. అటు బీఆర్​ఎస్​ నాయకులు సభ వెలుపల చేస్తున్న చేష్టలను తప్పుబట్టారు. తమ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య హక్కుగా ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పిస్తామని, ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​ సభకు రాకపోవడం సిగ్గుచేటన్నారు.

ఇది కూడా చదవండి: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 సీజన్ మొదలైంది. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *