నిజామాబాద్Indiramma Housewarming | ఒకే రోజు 700 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

Indiramma Housewarming | ఒకే రోజు 700 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మదన్​ మోహన్​ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Indiramma Housewarming | ఎల్లారెడ్డి (Yellareddy) నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో పేదల సొంతింటి కల సాకారమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకే రోజు సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) గృహప్రవేశాలు సోమవారం ఘనంగా జరిగాయి.

రామారెడ్డి (Ramareddy) మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ, షేక్ షబీన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madanmohan) పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ప్రత్యేకమైన రోజు అన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నాయని తెలిపారు. ఒకే రోజు 700కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు.

indiramma illu

Indiramma Housewarming | ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం

ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజా సంక్షేమానికి సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, గ్రామ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

 దీనిని కూడా చదవండి : Armoor Theft Case | బాబాయి ఇంట్లో చోరీ చేయించిన వ్యక్తి.. ముగ్గురి అరెస్ట్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...