BRS Dharna | హామీలు అమలు చేయాలి.. కలెక్టరేట్​ ఎదుట బీఆర్​ఎస్​ ధర్నా

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : BRS Dharna | ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్​ఎస్​ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​ గుప్తా (Bigala Ganesh Gupta) ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ నాయకులు నిరనస తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, 13 డిక్లరేషన్ లు, 6 గ్యారెంటీల పేరుతో నమ్మించి అధికారంలోకి వచ్చిందన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పి వెయ్యి రోజులు పూర్తి అయిన ఇప్పటి దాకా ఒక్క హామీ పూర్తి కాలేదని మండిపడ్డారు. వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

BRS Dharna | తులం బంగారం ఇవ్వాలి

కాంగ్రెస్​ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు మహిళలకు ప్రతి నెలా రూ.2500, కల్యాణ లక్ష్మి పథకంలో తులం బంగారం ఇవ్వాలని బిగాల డిమాండ్​ చేశారు. ప్రతి పంటకు రైతు భరోసా, కొరత లేకుండా ఎరువుల పంపిణీ, పంటలకు బోనస్, 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందించాలన్నారు. అర్హులైన నిరుద్యోగ యువతకు, నిరుద్యోగ భృతి, ఉద్యోగం, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Municipal Worker Protest | వాటర్​ ట్యాంక్​ ఎక్కి మున్సిపల్ కార్మికుడి నిరసన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *