నిజామాబాద్Farmers Protest | ఆంక్షలు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలి

Farmers Protest | ఆంక్షలు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలి

రైతులు పండించిన జొన్నలను ఆంక్షలు లేకుండా కొనుగులు చేయాలని భారతీయ కిసాన్​ సంఘ్​ నాయకులు డిమాండ్ చేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Farmers Protest | రైతులు పండించిన జొన్నలను ఆంక్షలు లేకుండా కొనుగులు చేయాలని భారతీయ కిసాన్​ సంఘ్ (BKS)​ డిమాండ్​ చేసింది. బయోమెట్రిక్​ విధానం తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.

జొన్నల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పిట్లం (Pitlam) మండల కేంద్రంలో సోమవారం భారతీయ కిసాన్​ సంఘ్​ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. కొనుగోలు అనంతరం ఓటీపీ విధానం అమలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతు బయోమెట్రిక్​ కావాలంటే.. కౌలు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. భూమి కౌలుకు ఇచ్చిన వారు నగరాలు, ఇతర దేశాల్లో ఉంటే వారు వచ్చి వేలిముద్ర పెట్టడం ఎలా సాధ్యం అవుతుందన్నారు.

Farmers Protest | లారీ డ్రైవర్ల దోపిడీ

కొనుగోలు చేసిన జొన్నలను తరలించడానికి లారీ డ్రైవర్లు డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. క్వింటాల్​కు రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారని, దీనిని కట్టడి చేయాలని డిమాండ్​ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే బాన్సువాడ సబ్ కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి, కార్యదర్శి శంకర్ రావు, ఆనంద్ రావు, రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Illegal Moram Mining | అక్రమ మొరం తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...