Father Kills Son | కుమారుడిని హత్య చేసిన తండ్రి అరెస్ట్​..

కుమారుడిని హత్య చేసిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బిచ్కుంద: Father Kills Son | మద్యం మత్తులో డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించిన కుమారుడిని హత్య చేశాడో తండ్రి. ఈ ఘటనలో తండ్రిని పోలీసులు (Bichkunda Police) అరెస్ట్ చేశారు.

Father Kills Son |పోతంగల్​ మండలం కల్లూర్​..

ఈ మేరకు శనివారం బిచ్కుంద సీఐ రవికుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పోతంగల్ మండలం కల్లూరు గ్రామానికి చెందిన చాకలి విజయ తల్లిదండ్రులైన కరుల గంగమణి, కరుల శివరాం, ఆమె సోదరుడు సురేష్ బిచ్కుంద గ్రామంలో నివాసం ఉంటున్నారు. సురేష్ మద్యానికి బానిసై తరచూ మద్యం సేవించి డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో 4న రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో సురేష్ మద్యం సేవించి ఇంటికి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులతో గొడవకు దిగాడు.

డబ్బులు లేవని చెప్పడంతో తన తల్లిని గొంతు నులిమాడు. దీంతో ఆగ్రహానికి గురైన తండ్రి కరుల శివరాం తన వద్ద ఉన్న తువ్వాలును సురేష్ మెడకు చుట్టి  హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు కరుల శివరాం నేరానికి ఉపయోగించిన ఎరుపు రంగు తువ్వాలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివరాంను రిమాండ్​కు తరలిస్తామని సీఐ రవికుమార్ తెలిపారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన ఎస్సై రాజు, పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు.

ఇది కూడా చదవండి: అమావాస్య రోజు ‘ఆకాశ దీపం’ ఎందుకు వెలిగిస్తారు? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *