అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nitin Nabin Nizamabad Visit | త్వరలో ఇందూరులో(Nizamabad) బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించనున్నారు. ఎంపీ అర్వింద్ అభ్యర్థన మేరకు ఆయన జిల్లాలో పర్యటించనున్నారు.
Nitin Nabin Nizamabad Visit | దేశవ్యాప్తంగా యాత్ర..
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న వివిధ యాత్రలు, కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్లో కూడా పర్యటించి, యాత్ర నిర్వహించాలని ఎంపీ అర్వింద్ కోరారు. ఈ మేరకు నితిన్ నబీన్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పార్టీకి ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ప్రాంతమన్నారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొనడంతో పాటు, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశం కలుగుతుందని తెలిపారు.
Nitin Nabin Nizamabad Visit | త్వరలోనే షెడ్యూల్..
ప్రస్తుతం రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన వెంటనే నిజామాబాద్లో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని ఎంపీకి నితిన్ నబీ తెలిపారు. జాతీయ అధ్యక్షుడి తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించడం పట్ల ఎంపీ అర్వింద్ ధర్మపురి సంతోషం వ్యక్తం చేశారు. దీపావళి పండుగ అనంతరం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ను ప్రత్యక్షంగా కలిసి, నిజామాబాద్ పర్యటనకు అధికారికంగా ఆహ్వానించనున్నట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: ఒకే పండుగ.. మూడు ప్రాంతాలు.. మూడు రకాల సంబరాలు!